పిల్లలు - పెంపకం
పిల్లలు - పెంపకం
బాల్యం మారుతోంది
చిత్రంగా ఎప్పుడూ మారుతూనే ఉంది
వీధి బడులు
విడువని ట్యూషన్లు
పిల్లల కోసం ప్రత్యేక చిత్రాలు
తెలిసీ తెలియని వయసని
క్షమించదగ్గ తప్పులు
ఈతలు
బడికి పోనని చెప్పే సాకులు
బాల్యాన్ని చూసి పెంపకం భయపడుతోంది
బరువైన పుస్తకాల సంచీకి
భరించలేని విపరీత పోటీకి
మార్కులు తక్కువొస్తే జరిగే నామోషీకి
ఇంకా ఎన్నిటికో
పసి మనసులు వేసే ప్రశ్నలకు
పెద్దరికం భయపడుతోంది
చదువుకున్న చదువుకు ఉద్యోగం అని చెప్పలేరు
అలాగని చదవద్దనీ చెప్పలేరు
తమకు ఎదురైన చేదు అనుభవాలు
తమ పిల్లలకు రాకూడదని ప్రయత్నాలు చేస్తారు
కానీ ఆ ప్రయత్నాల్లో
పిల్లలు ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతున్నారో ఏమో
అనే ఆలోచన వారికి తట్టదేమో
మార్పు తప్పనప్పుడు
పోటీ ఆత్మ విశ్వాసాన్ని పెంచేలా చేయాలి కదా
ఆత్మహత్యల వైపు తోయకూడదు కదా
