పెళ్లి- జీవితంలో మలుపు
పెళ్లి- జీవితంలో మలుపు
రాకుమారుడి రాకకై ఎదురుచూసే కనులు
అందమైన అనుభూతులకై తపించే హృదయం
ప్రతి నీడను కోరే ప్రాణం
ఆ ప్రేమానురాగాలకు ఎదురుచూసేను ప్రతిక్షణం
భర్తే తన లోకం అనే భావం
తన ఊహలే కాదా ప్రపంచం
మంచి భర్త ఇచ్చే ఆనందం
భార్య జీవితంలో కష్టాలను చేయును అదృశ్యం
ఆ తీయని పలకరింపులోని మకరందం
ప్రతిక్షణాన్ని చేయదా అద్భుతం
పతి తోడై నడిచే జీవితం
కాదా ప్రతి అమ్మాయికి వరం
