STORYMIRROR

Dinakar Reddy

Abstract Romance

4  

Dinakar Reddy

Abstract Romance

ఓడిపోయినా బాగుంది

ఓడిపోయినా బాగుంది

1 min
291

నీ కౌగిలిలో ఊపిరాడనివ్వకున్నా

నీ మాటల్లో నన్ను బంధించుకున్నా

బాగుంది


నీ వెనకాలే తిరుగుతూ ఏడిపించడం

నీ పెర్ఫ్యూమ్ దొరక్కుండా దాచేయడం

బాగుంది


నీ పంటి గాట్లు చూసుకోవడం

నీ గోళ్ళు నే గిల్లుకోవడం 

బాగుంది


నీ కళ్ళకు ముద్దులతో మసాజ్ చేయడం

నీ పెదాలకు నా వేళ్ళు స్నేహితులవడం

బాగుంది


నీ సినిమాలో నే హీరోనవ్వడం

నా కుళ్ళు జోకులకు నువ్వు పడీ పడీ నవ్వడం

బాగుంది


నీ ఆనియన్ సమోసాలో నే ఆనియన్స్ మాయం చేయడం

నా ప్లేట్లోంచి నువ్వు లివర్ ముక్కలు స్వాహా చేయడం

బాగుంది


నీ అల్లరికి నేను దణ్ణం పెట్టడం

నా వలపుకు నువ్వు చెవి మెలి పెట్టడం

బాగుంది


నీ కలల్లోకి నే రావడం

నా నిద్ర నువ్వు చెడగొట్టడం

బాగుంది


నీ ఊరించే పలకరింపులు

నా యవ్వనపు పలవరింతలుగా మారడం

బాగుంది


నీ కోసం అన్నీ వదిలేయడం

నేను నీకు చెందాను అని అనిపించుకోవడం కోసం

నేను ఓడిపోవడం కూడా బాగుంది

దీన్నే ప్రేమంటారా

అందరూ ఇంతేనా

లేక మనమే స్పెషలా


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Abstract