ఓ తాళం
ఓ తాళం
మౌనం ఓ మార్మిక కళ!
తెలుపైనా నలుపైనా...
మనసు రంగులెన్నున్నా...
మదిలో భావం ఏదైనా...
దాచేసే ఓ యవనిక!
దృష్టిని మది గదిలోకి
చొరపడనివ్వని ఓ జవనిక!
మూతబడిన నిజానికి...
లోతు తెలీని అంతర్వాహినికి...
అంతరిక్షమంటి అంతులేని ఆలోచనలకు...
మూతవేసిన మదికి...
మౌనం ఓ తాళం!

