STORYMIRROR

Midhun babu

Classics Fantasy Others

4  

Midhun babu

Classics Fantasy Others

ఓ మగువ

ఓ మగువ

1 min
2



ప్రతి ఇంటికి మహాలక్షీ వైనావు.
నువ్వు లేని ప్రపంచం శూన్యం.
అటు ఇటు పరుగులు తీస్తావు.
వెనుకుండి గెలిపిస్తావు విజయాన్ని.

ప్రతి పనిలో ముందుంటావు.
ఎన్నో బాధ్యతలు నిర్వర్తిస్తావు గొప్పగా.
ఓపిక సహనానికి మారుపేరువు.
ఎన్నో సమస్యలు మోస్తున్న పైకి నవ్వుతూ 
లోకాన్ని జయిస్తావు. 

ఎందరికో ఆదర్శం నువ్వు. 
ఎంత చదివినా అర్థం కాని జీవిత పాఠానివైనావు.
ఎన్నో పాత్రలు అవలీలగా పోషిస్తావు. 
కన్న తల్లిదండ్రులకు బిడ్డగా.
అన్నయ్య తమ్ముళ్లకు అక్కగా.
భర్తకు భార్యగా. 
పిల్లలకు తల్లిగా ఎన్నో బాధ్యతలు మోసే స్త్రీ మూర్తివి.

 ఆయుధం లేకుండా యుద్ధం చేయగలవు. 
ఎన్నో జీవితాలు నిలబెట్టగలవు. 
ఈ ప్రపంచం నీకే దాసోహం ఓ మగువ. 
సాగిపో నిరంతరం పొంగే ప్రవాహమై. 
 ప్రతి ఇంటి గడపకు పసుపు పారానివై నిలుస్తావు 
ఈ లోకాన. 


Rate this content
Log in

Similar telugu poem from Classics