STORYMIRROR

Midhun babu

Classics Fantasy Others

4  

Midhun babu

Classics Fantasy Others

ఇల్లే నా

ఇల్లే నా

1 min
2


గోడలపై కప్పువేసి రంగులేస్తె ఇల్లేనా 
మెత్తనైన సోఫాలతొ సర్దుకుంటె ఇల్లేనా 

పదిమందికి కడుపునింపి క్షుద్బాధను తీర్చాలి 
అన్నార్తులనాదుకోని సతివుంటే ఇల్లేనా 

ఎల్లప్పుడు చేతిలోన చరవాణీ ఆభరణం
భగవంతుని ధ్యాసలేక తిరుగుతుంటె ఇల్లేనా 

చేతిలోన కంచంతో ఒక్కొక్కరు తలోదారి
సభ్యులంత ఒకేసారి తినకుంటే ఇల్లేనా 

రచనలెన్ని చేసిననూ పదములెన్ని అల్లిననూ 
తెలుగుగజలు రాయలేని కవివుంటే ఇల్లేనా


Rate this content
Log in

Similar telugu poem from Classics