STORYMIRROR

Midhun babu

Classics Fantasy Others

4  

Midhun babu

Classics Fantasy Others

ప్రేమధనం

ప్రేమధనం

1 min
2


పచ్చదనం కాపాడే..పుడమితనం ప్రేమధనం..! 
చంపుగుణం కాల్చేసే..అగ్గితనం ప్రేమధనం..! 

దైవంకోసం వెతికే..చర్యలన్ని ప్రయాసలే.. 
గురునిధినే వరమిచ్చే..మనిషితనం ప్రేమధనం..!

పరిశోధన లేవైనా..ప్రాణాంతక సాధనలే.. 
సమరవాంఛ రద్దుచేసే..చెలిమితనం ప్రేమధనం..! 

కలిసిమెలిసి బ్రతుకుతీరు..నేర్పువిద్య శ్వాసవిద్య.. 
ప్రగతిశీల చైతన్యపు..శిల్పితనం ప్రేమధనం..! 

మౌనంతో కూడివున్న..రుషులేనోయ్ అక్షరాలు.. 
భాషనుదుట దిద్దబడే..పసిడితనం ప్రేమధనం..! 

అమ్మచేతి ముద్దమహిమ..ఏ పలుకుల కందేనట.. 
కన్నతల్లి ఆశయాల..మల్లితనం ప్రేమధనం.. !



Rate this content
Log in

Similar telugu poem from Classics