STORYMIRROR

Myadam Abhilash

Tragedy Classics Fantasy

4  

Myadam Abhilash

Tragedy Classics Fantasy

ఓ మానవత్వమా!

ఓ మానవత్వమా!

1 min
96

నీ కోసమే

నా అన్వేషణ!

నీ కోసమే నా ఆరాటం!!


నిన్ను వెతుకుతుంటే..

సంద్రమనే జీవితకెరటాల్లో 

కొట్టుకుపోయి,

ముత్యాల కోసం

వెతికినట్టుంది!!


నీ కోసం

నీ వార్త కోసం

విలేకర్ల విలాపాన్ని,

దినపత్రికల

దీనాలాపాన్ని

నేను సహించలేను!!


ఇంతకూ ఉన్నావా నువ్వు?

నువ్వుండేది మనిషి లోనా?

లేక మృగం లోనా?


పాత వస్తువులను

అగ్ని దహించినట్లు

కొంపదీసి

నువ్వు కూడా

కాలిపోయావా యేమి??


రానూ రానూ

రచయితల రాతలకు

కవుల కవితలకుమాత్రమే 

పరిమితమౌతావేమోనని

భయమేస్తోంది!!


మీరైనా

 కనబడితే నాకు చెప్పండి

నా హృదయ బంధిఖానా లో

బంధిచేస్తా!


మనుషుల మనసుల్లో నిన్ను

కట్టి పడేస్తానే ఓ మానవత్వమా!!!

(కరోనా కష్ట కాలం లో మానవత్వం మంట కలిసి పోవడం చూసి..)



రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Tragedy