STORYMIRROR

Thorlapati Raju(రాజ్)

Drama Action Inspirational

4  

Thorlapati Raju(రాజ్)

Drama Action Inspirational

ఓ మానవా!

ఓ మానవా!

1 min
360

వేదన..వేదన

మనిషికెప్పుడూ ఒకటే వేదన

సాధన..సాధన..

విశ్రాంతి లేని సాధన..

తపన తపన

మనసులో ఏదో కావాలని తపన

ఎందుకోసమో...తెలుసా

వెనుక ఉన్న తాను..

తన కన్న ముందున్న వారిని దాటలని తపన


మానవుడెప్పుడూ..

ఎదిగేందుకు ఎంచుకుంటాడు కొలమానం

అదే తన కన్నా ముందున్న వాడి స్థానం

దానికోసమే చేస్తాడు నిత్య రణం

భూమిపై తీరాక ..ఋణం

తప్పదు ఎవరికైనా...మరణం

కాకపోతే..ఒకరు ముందు ఒకరు వెనుక

ప్రయాణం


ఓ మానవా...

నీ మనసుకో... దణ్ణం

ఎప్పుడు ఎలా ఉంటాదో నీ గుణం

పోలిక మెదడులో మొదలైన క్షణం

నీ కన్న ముందు వాడ్ని కొట్టేందుకే

ఎక్కుపెడతావు...బాణం

ఏమౌతుంది రా బాబు నీ విజ్ఞానం

ముందు.. వెనుక 

వెనుక..ముందు అయినా ...

ఆస్వాదించాల్సింది..నీ ప్రయాణం..

అని తెలుసుకోక పోవడమే

మానవుని అజ్ఞానం!

    

          .......రాజ్.......

  



రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Drama