ఓ భావం
ఓ భావం
ఓ భావం రాసానా మళ్లీ నే బతుకుతాను
నా హృదయం తెరిచానా కాలాన్నే గెలుస్తాను
అలసిపోయి నేనున్నా ఆగలేక రాస్తున్నా
మనసు తోటి ఆడావా మౌనంగా మిగులుతాను
అద్భుతమో బుద్బుదమో నిను కదపని నా కవనం
చివరి పాట వింటావా జాలి జోల రచిస్తాను
చూసి వెళ్లి పోరాదా చివరిసారి ఓ నేస్తం
ప్రేమ రాల్చిపోతావా నా ఊపిరి విడుస్తాను
కలలు కరిగిపోతున్నవి కన్నీళ్ళై ఓ సత్యా..
తిరిగి చూసి వెళ్ళావా జన్మంతా తపిస్తాను…

