నవ్వూ
నవ్వూ
అంతర్జాతీయ నవ్వుల దినోత్సవ శుభాకాంక్షలు.
నవ్వూ నవ్వూ
మళ్ళీమళ్ళీ నువ్వూ నవ్వూ,
తన్మయత్వపు తలపు నవ్వూ,
వ్యధను త్రుంచే ఆయుధం నవ్వూ,
సుధలు పంచే చెలిమి నవ్వూ,
మధురిమల పులకింత నవ్వూ,
మొదటి ప్రేమగీతం నవ్వూ.
అందుకే నవ్వూ నవ్వూ
మళ్ళీమళ్ళీ నువ్వూ నవ్వూ.
పెదవి చిరునామా నవ్వూ
రాగభావ మనోవీణ నవ్వూ,
సరససరాగాల చిలిపి తలపు నవ్వూ
పాలబుగ్గల లేతసిగ్గు నవ్వూ,
మంచుకడిగిన మల్లెపూవు నవ్వూ
హృదయ స్వర్గపు సోయగం నవ్వూ.
అందుకే నవ్వూ నవ్వూ మళ్ళీ మళ్ళీ నువ్వూ నవ్వూ.
పరిహాసపు నవ్వుతొ చెలిమి దూరం అవ్వు,
పగటికలల నవ్వుతో బ్రతుకు ప్రశ్నార్థకం అవ్వు,
ప్రగాల్భాల నవ్వుతో అందరిలో చులకన అవ్వు,
అలుపెరుగని జీవితంలో చిరునవ్వే జీవన మాధుర్యం అవ్వు.
అందుకే నవ్వూ నవ్వూ మళ్ళీ మళ్ళీ నువ్వూ నవ్వూ.
