నవ్వుల వనములు
నవ్వుల వనములు
నవ్వుల వనములు..పెంచుట ఎపుడోయ్..!?
కణమును గురువుగ..ఎఱుగుట ఎపుడోయ్..!?
ప్రేమకు గుడిగా..ఉందా హృదయం..
సత్యము నందగ..చూచుట ఎపుడోయ్..!?
జ్ఞానం తోడుగ..ఉన్నది దేనికి..
కట్టెను కట్టెగ..తెలియుట ఎపుడోయ్..!?
మట్టిని పండ్లుగ..మార్చును మానే..
మనిషిగ మనిషియె..మసలుట ఎపుడోయ్..!?
తింటూ త్రాగుతు..పోయే దెటకో..
మూసిన కిటికీ..తెఱచుట ఎపుడోయ్..!?
ఏదో వేదం..ఏదో వాదం..
గంధా లన్నీ..రాలుట ఎపుడోయ్..!?
