నవ వసంతం
నవ వసంతం
నవ వసంతం
సిగ్గు మొగ్గలైన చిరునవ్వే
చెలి మోము కందం
పెనవేసావు చిరునవ్వుతో
తీయని మమతాను బంధం
విరిసిన కుసుమం నీవై
వీచే పరిమళం నేనై
చిలిపి ధరహాసంతో ప్రియా !
నా మనసే దోచావు
కమ్మని కలై పొంగావు
తెచ్చావు నవ వసంతం
పంచావు మధుమాస సంబరం
చిత్రంగా అయ్యాను నీకు బంధీని
నీ తొలకరి నవ్వుల పులకింతలతో
నీ చిలిపి చిరునవ్వే చెలిమి చిరుగంటై
మ్రోగించు నా హృదయ వీణను సరాగాల పంటై
కురవనీ చిరకాలం----------------నీ చిరునవ్వుల చిరుజల్లులు !!

