నువ్వులతో
నువ్వులతో
ప్రణయసుధా బిందువులే కురిసే నీ నవ్వులతో ...
ప్రణవ నాద శబ్దములే పలికే నీ నవ్వులతో...!
కావ్యము గా విరచించిన రసాస్వాద మాధురిలే...
గజలు గాను పాడుకొందు మెదిలే నీ నవ్వులతో!
కుందనాల బొమ్మవుగా, పున్నమి లో జాబిలివే!
ప్రేమ పాత్ర దోసిలిడితి...కురిసే నీ నవ్వులతో...
ఆ సుందర రూపములో దైవత్వమె భాసిల్లును...
ఆహృదయపు కోవెలైతి....కదిలే నీ నవ్వులతో...!
ఇరువురాత్మ లొకటేకద....శరీరాలు వేరైనా...
పరమాత్మను కోరుకుందు ..చిలికే నీ నవ్వులతో..!

