నువ్వు
నువ్వు
ఎవరి జీవితాల్లోకి వెళ్లి అవమానపడకు,
ఎంత మంచి చేసిన ఎంత ప్రాణం నిలబెట్టిన,
కన్నీళ్లు తుడిచి నేనున్నానని ధైర్యం చెప్పిన,
ఎన్ని సమస్యలు ఎదుర్కొన్నా
అన్ని బూడిదలో పోసిన పన్నీరే,
మంచి చేసిన మనుషుల్ని మరిచిపోతారు,
సహాయం చేస్తే గుర్తుపెట్టుకోరు,
ఎంత మన అనుకుంటే పరాయి వాళ్ళల
చులకనగా చూస్తారు,
అవమానిస్తారు కన్నీళ్లు కురిపిస్తారు,
చిన్న సహాయం చేస్తే గుర్తుపెట్టుకునే ఈ రోజుల్లో
అన్ని మర్చిపోయి గుండెకు గాయం చేస్తారు,
పెట్టుకున్నా నమ్మకాలు కూల్చేస్తారు,
నవ్వుతూ నవ్వుతూ మోసం చేసి వదిలేస్తారు
చివరికి,
వచ్చిన అదృష్టాన్ని పక్కకు నెట్టేసి
దురదృష్టంతో అడుగులు కదుపుతారు,
ఊహ తెలిసి ఎవరి జీవితంలోకి వెళ్లి అవమానపడకు
బాధపడకు నువ్వు....
