నువ్వే నా ఆక్సిజన్
నువ్వే నా ఆక్సిజన్
ఎప్పుడూ ఇవే ఆలోచనలు
నువ్వు నాతో ఉన్నట్టు
నువ్వు నాతో లేనట్టు
నువ్వు నా దగ్గరికి మళ్ళీ వచ్చినట్లు
నన్ను ముద్దుల్లో ముంచెత్తినట్లు
నే నీ యదను తాకినట్లు
నువ్వే నా ఆక్సిజన్ అయితే
అది వ్యసనమెలా అవుతుంది
ప్రియా
నువ్వు తోడు లేకుంటే
నా జీవితం అర్థవంతం ఎలా అవుతుంది