నువ్వే హీరో
నువ్వే హీరో


ఓటమి దెబ్బకు క్రుంగిపోయిన వారెందరో
వారిని లోకం గౌరవిస్తోందా
లోకం సంగతి ఎందుకు
నువ్వు గౌరవిస్తున్నావా
ఎవరినో ఎందుకు
నీ తండ్రిని అడుగు ఓటమి అంటే ఏమిటో
జీవితానుభవం అంటే ఏమిటో
ఎన్ని సార్లు ఓడిపోయి ఉంటాడో సమయానికి నీకు డబ్బులు పంపలేక
ఎంత యాతన పడి ఉంటాడో నీకు ప్రతి పండక్కీ మంచి బట్టలు కొనివ్వలేక
ఎవరికీ చెప్పలేక
చెప్పుకోలేక
ఒప్పుకున్నాడా ఓటమి
లేదే
నీ ముఖం మీద చిరునవ్వు కోసం
ఒక్క సారి కాదు
వేల సార్లు ఓటమిని ఓడించి
నీకోసం గెలిచాడు
చాలా మంది పిల్లలు తమ తండ్రి టాటా బిర్లా అంబానీ అంత గొప్ప ఏమీ కాదు అని అనేస్తారు
కానీ నిను గెలిపించాలని ఆ తండ్రి ఎన్ని సార్లు ఓడిపోయుంటాడో కదా
ఈ రోజు నువ్వు ఏదో పోటీలో ఓడిపోయావని
జీవితంలో ఓడిపోయానని
నీ సామర్థ్యాన్ని నీలోని శక్తిని నిందిస్తూ కూర్చుంటావా
ఒక్కసారి అడిగి చూడు
నాన్నా ఓటమినెలా భరించావ్ అని
మిత్రమా
ఓడిపోయిన వారి దగ్గరే గెలుపెలా పొందాలో నేర్చుకో
వారి తప్పొప్పుల పాఠాలు నీ జీవితానికి అన్వయించుకో
మళ్ళీ ప్రయత్నించు
విజయాన్ని అందుకో మరొకరికి మార్గాదర్సివికా
నీ కుటుంబానికి నువ్వే హీరోవి
దాన్ని గెలిపించాల్సిన బాధ్యత నీదేనని మర్చిపోకు
ఏమో నీ విజయం
నీ కన్నవారు
“మా కొడుకు/కూతురు అంబానీ కంటే తక్కువేం కాదు”
అనేలా చెయ్యగలదేమో
ప్రయత్నం చేయి