నూవ్వూనేను
నూవ్వూనేను
ఆలోచనలు మార్చుకోమంటారు ...
ఆవేశం ఎందుకంటారు?
ఆయాసం పెంచుకోకంటారు!
అంటి ముట్టినట్లు ఉండిపోమంటారు
చూసీ చూడనట్లు వెళ్ళిపోమంటారు...అలా...
ఎలా?...అలా...?...
అదే జీవితం రాసిన వ్యంగ్యం…
గడ్డి తిని పడుకుని
మోచేతి నీళ్లు త్రాగుతూ
సమాజం విచ్ఛిన్నమైన
విస్పోటనాలు సంభవించిన
చలనం లేని మనిషి లా
అత్యాశను మోస్తూ
విలాసాలను వెతుక్కునే
రాబందులు...
తెల్ల చొక్కాలే ధరిస్తాయి...
ఆ వెనుకే రక్తాన్ని ఏరులై పారిస్తాయి...
ధర్మాన్ని పాతేస్తాయి...
నీతులే వల్లిస్తాయి...
హింసను చూస్తూ
అహింసను ఎంచుకోమంటే
నరాల్లో ప్రవహించే నెత్తురు
అన్యాయాన్ని ఎదుర్కొనే ధైర్యం
ఆయుధం వైపే అడుగులేసింది...
నిస్సహాయులకు అండగా నిలిచింది...
రాక్షస సంహారం చేయడానికి
కలియుగాన మిగిలింది
నువ్వూ...నేనే...
