నూతన సంవత్సర తీర్మానం
నూతన సంవత్సర తీర్మానం
ఏటఏటా వచ్చెను కొత్త ఆంగ్ల సంవత్సరం,
జ్ఞాపకం ఉంచుకోవాలి మన తెలుగు సంవత్సరం |౧|
ప్రారంభమయ్యెను నవ వర్షం,
కొత్త కాలచక్రానికి స్వీకరిద్దాం సహర్షం |౨|
జీవితంలో ఆరంభమయ్యెను నూతన అధ్యాయం,
ఒక ఏడాది నడిచెను ఈ పర్యాయం |3||
మంచి-చెడు అనుభవాలతో కనబడెను ప్రతీ పుట,
శ్రీ వెంకన్నస్వామి శ్రీ జగన్నాథస్వామివారి భక్తిలో ఉండాలి మన బాట |4|
వెళుతున్న సంవత్సరం ఇచ్చెను అమూల్యమైన శిక్ష,
వచ్చే ఏడాది ధైర్యంగా ఎదురుకోవాలి ప్రతీ కొత్త పరీక్ష |౫|
మన ప్రాచీన పరంపరలు ఇద్దాం రక్ష,
భాషా సంస్కృతి వ్యవహారాల తృటులకు చేద్దాం సమీక్ష |౬|
ప్రతీ ఏడాది వచ్చెను ఈ ఆంగ్ల సంవత్సరాది,
మర్చిపోకుండా పాటిద్దాం మన తెలుగువారి సంవత్సరాది ఉగాది |౭|
ప్రతీ సారి తీసుకుందాం నూతన సంవత్సర తీర్మానం,
కస్టపడి ఇష్టపడి ప్రయత్నించటమే సార్థకం చెయ్యటానికి సోపానం |౮|