నమ్మిన ప్రేమ నాకు మిగిల్చిన చేదు జ్ఞాపకాలు
నమ్మిన ప్రేమ నాకు మిగిల్చిన చేదు జ్ఞాపకాలు
ప్రతి క్షణం గుర్తుకోస్తూఅనుక్షణం నా ప్రాణాలని నిలువునా
చిల్చేస్తూంటే చితిమంటల జాడని అన్వేషిస్తు..
జీవితాన్ని ద్వేషించుకుంటూ వెలుతున్న క్షనాన నమ్మిమోసపోయిన
మనసును అసహ్యించుకుంటు మరణం వైపు మౌనంగా నే
అడుగులేస్తుంటే అనుకోకుండా అప్యాయంగా పట్టపగలు మిట్ట
మద్యాన్నం ఓ తీయని స్వరం ఒక మనసు నన్ను పలకరించింది..
తన చిలక పలుకులతో మనస్సు పులకరించింది తన జ్ఞాపకాల
తోటల్లో విహరించేలా చేసింది తన మాటలతో చినుకల్లే నా మదిని
తాకి ఆవిరైపోతున్న నా ఆశలకి ఊపిరోసింది మరణమే శరణ్యమనుకొంటు,.
రాయిలా మారినా నా మనసుకి కల్మషం ఎరుగని ఆ పరిచయం ప్రాణంపోసి మరుజన్మనిచ్చింది మనిషిగా మళ్లీ నన్ను నిలబెట్టింది కన్నీటీలో కరిగిపోతున్న
నా ఆశయాలని గతి తప్పిన నా గమ్యాన్ని అనుక్షణం నాకు గుర్తుచేసి ఊరించి ఉడికించి మాయచేసి మాయం అయింది
తనూ అందరిలాగా గుండెకు గాయం చేసింది వంటరిని చేసి మౌనంగా వెల్లిపోయింది జాబిల్లి కొండంత ధైర్యం ఇస్తూ అండగా ఉండి నన్ను ముందుకు నడిపిన నిన్నూ,నీ స్నేహాన్ని మరువలేను మిత్రమా.... నే మరణించేదాకా.....

