ఏ మాయ చేసావో.....!
ఏ మాయ చేసావో.....!
ఎదను తట్టిన నీ ఊహ ఏదో
నా మదిని హాయిగా ఉంచదా
మదిలొ నిండిన రూపమేదో
గుండెగదిలో నిలిచి పోదా
నీవు పిలిచిన పిలుపుఏమో!
చెవులకింపై మురిసిపోయే
నేను పిలవగ పలుకవేమి
మూగ సైగల మధుర వాణి
ఎదుట లేవని బాధలేదు
మనసు నీదై ఉండగా....
నీ ఉనికి ఏదని అడుగుతానా!
సుడులు తిరిగి నీదు గురుతులు
నా చుట్టుముట్టి ఉండగా...
కనులు మూసినా కావ్యమౌతావు
కనులు తెరిస్తే చిత్రమౌతావు
చిత్తగించుమా ఓ నక్షత్రమా!
నిన్ను చూస్తూ చంద్ర బింబమై
ఎన్ని యుగాలైందో నీకే తెలుసు.
వెన్నెలైతివి...వెలుతురైతివి
మరిచిపోవుట జరుగునా...
జీవితమై నీవె వుంటివి కదా!
కంటి రెప్పలు పోరు వినవా
లిప్తపాటునీ వృధా చెయ్యక
నీ రూపు ఊహారేఖల చట్రమై
ఛత్రం పట్టుకొని నిలుచి ఉన్నయ్.
పవిత్రమయ్యెను హృదయమంతా
నీ తోడుకోరిన క్షణము నుండి
ఏమి మాయను చేసినావో
నా శ్వాస మనుగడ నీ ఊహ వెంటే!
అద్దమెందుకు మన ఇద్దరికీ సఖీ!
అర్ధనారీశ్వర మేని మనదికాగా!