ప్రేమాయణం
ప్రేమాయణం


ప౹౹
అలలపై ప్రణయ కలల ప్రయాణం
కలకలమేలా కలదు ప్రేమాయణం |2|
చ||
మేళవించిన మనసుల మమతలు
మేల్కొనిన నవ వలపు ఆమెతలు |2|
సరిపోలే సరసపు సంగీత రవళిలే
సరి లేని వరసలు పలికే మురళిలే |ప|
చ||
కోరెలే కొత్తదనం కొంటెతనమే రేగా
మారెలే వింతగ మదిలోనే ఊరేగా|2|
పల్లవించిన ప్రణయం పలవరించే
పలుమారులే ప్రకటించి వివరించే |ప|
చ||
ఎడదలో మర్మమేమిటో ఎరగవా
ఎడదీయలేని బంధాలూపెరగవా |2|
కలలయానం కలిపే కల్యాణానికి
కమనీయమే ఇక ఆ లావణ్యానికి |ప|