కనుగొన్నానులే
కనుగొన్నానులే


ప||
కనుగొన్నానులే ఒక కమనీయ రూపం
అనుకునే ఆ మనసులో యధాలాపం|2|
చ||
కనులలోని మెరుపులన్నీ మెరిసిన వేళ
తనువులోనీ తళుకులెన్నో కురిసే చాల|2|
అనువైన వేళ ఆశలన్నీ మురిసెగ హేల
అనురాగమే అతిశయించే ఓ పూబాల |ప|
చ||
సంతోషమే మనిషికి తెచ్చేగ సగ బలం
కోరికే కొండలెక్కి విహరించే గగనతలం|2|
హృదయమే మీటునులే హేమాతలమే
దయే లేకున్న అంతా అతలాకుతలమే|ప|
చ||
మనసులో పొంగె మమతలు లావాలా
ఆ వేడి కోరికలే ఎదలో మరిగిపోవాలా |2|
గగనసీమకేల గమనమెరిగి సమీపించు
గాఢపరిష్వంగంలో గరితవై మురిపించు|ప