గుండె గుబులు
గుండె గుబులు


తీయగా పిలిచినది నిజంగా ఆ స్వరమేనా
హాయిగా అనిపించే మదికి అది వరమేనా ౹2౹
చ౹౹
ఎక్కడిదో పిలుపూ ఏ విధంగా కనిపెట్టాలి
చక్కటిదే ఎదుటలేనిదే ఎలాగ పసిగట్టాలి ౹2౹
జావళీ ఎదురుగా పాడి వినిపించినట్లుందే
రసకేళీ రసభరితంగానూ మురిసినట్లుందే ౹ప౹
చ౹౹
కొండ కోయిల రాగంలా గుండెను తాకింది
నిండు కోరికయై మదిలో మంటగసోకింది ౹2౹
సమీపించిన సమీరమే సరసము పెంచగా
వశీకరించిన వలపే సమయమూ ఎంచగా ౹ప౹
చ౹౹
విడదీసిన బంధమే మళ్ళీ కలిపినట్లున్నదే
విరిచేసిన మనసూ బాగా అతికినట్లున్నదే౹2౹
ఎదలో తిరుగాడే గుండె గుబులు ప్రేమేనా
ఎలమి రాగాలే అలా పలికించింది ఆమేనా ౹ప౹