సంగతేమిటో..
సంగతేమిటో..
ప౹౹
సంగతేమిటో తెలిసిందిగా కొత్త సరసంలో
కనుగొన్నదేమిటో చెప్పాలా అవసరంలో ౹2౹
చ౹౹
ఎదలోనే ఎందుకో చెప్ప లేని కలవరమూ
మదిలోను మోగే ఆ తెలియని వివరమూ ౹2౹
ఆ కనులలోనే చూసాను వింత మోహనం
ఆ తేనెలలో తీపికై కావాలి కొంత సహనం ౹ప౹
చ౹౹
వేకువ కలనూ ఏమని మరి ఏమరుతును
మెలకువ రాగానే మరుతునా గురుతును ౹2౹
సరదాలన్నీ కలసే కలలో ప్రేమ కోసరమూ
సొదలేని సోయుగం వచ్చివ్వదా వరమూ ౹ప౹
చ౹౹
సరసంలో విరామమంటే మరి విరహమేగ
వరసమారకమునుపే వరించ సహజమేగ ౹2౹
కనుగొన్న సంగతి ఏ మాత్రం సవరించకనే
అనుకొన్న ప్రేమను సాగించు వివరించకనే ౹ప౹