విరహం
విరహం
1 min
415
ప౹౹
విరహమా ఇవ్వవా కాసేపు విరామం
సరసమా చాలించవా నీకో ప్రణామం |2|
చ||
ఎన్నడో చూపిన ఆ ఉగ్రం చాలించవా
ఎపుడూ చిరు నగవుతో లాలించవా |2|
కనుసన్నలలోనే ఉంచేసి కాపాడవా
కలలోని కమనీయ గీతాలూ పాడవా |పై|
చ||
ఎదగిల్లినే మత్తుగాను ఎడతెరిపి లేక
సొదచేయ మదిలో ఎటుతేల్చుకోలేక |2|
కనిపించని స్వర్గమొకటి కరుణించగ
కలిసి చెలిమి చెలియలికట్టలే తెంచగ |ప|
చ||
ఊహతోనే ఉలికిపాటే సాగినే పాటగ
ఉరకలేసే ఆ ఊహలూ వలపు బాటగ |2|
విరహమా ఇక లేదుగా ఎలమి కరువు
విరామమే నీకు అని మరులు ఏకరువు |ప|