అనుకోలేదూ..
అనుకోలేదూ..
ప౹౹
అనుకోలేదూ నువ్వే ఆమనిలా వస్తావని
తెలుసుకోలేదే మల్లెల మత్తునే తెస్తావని ౹2౹
చ౹౹
సింగారించిన చిలుకకే తెలుసే సోయుగం
పొంగారని అందమే ఆ కళ్ళకే కొత్త భోగం ౹2౹
వాడి చూపుల వలవేసి మెలివేసే మదిలో
వేడి నిట్టూర్పుల విరహం ఇక ఎద గదిలో ౹ప౹
చ౹౹
తేనె పలుకులూ తెరువ చూపే తెరువరికీ
వాన చినుకులూ వలపే పెంచే ఇరువురికీ ౹2౹
కొత్తసమరమే మెత్తగా మొదలిడి సాగాలి
చిత్తమంత ఎలమి ఊయలలోనే ఊగాలి ౹ప౹
చ౹౹
కొంటె గాలి సాగే కోమలి పిలుపుతో కలిసి
జంటగానే నడవాలి ఆ సమీరంతో మెలసి ౹2౹
అనుకొని ఆ అనుభవాలనే పంచుకోవాలి
కనుగొని కొన్నైనా ఎదలో దాచుకోవాలి ౹ప౹