ప్రేమంటే
ప్రేమంటే


ప౹౹
ప్రేమంటే మనసులో కలిగే పలవరమేనా
ఏమంటే చెప్పలేని తనువు పరవశమేనా ౹2౹
చ౹౹
సారించి తన్మయం సరిజేరినే ఒడలంతా
సాగించి ఆ వలపే పెంచిపెరిగే కడలంతా ౹2౹
వలపు వాకిలితోను ప్రేమ ప్రవాహమేను
తలపు వారధితో గెలపే ఊహించే మేను ౹ప౹
చ౹౹
సాధించి తెలిసికొన చేసే సరస సమరం
శోధించి చెప్పాలని ఆ మత్తులో వివరం ౹2౹
ఊగించి ఊరించకే నిలకడలేని మనసా
కరిగించి కవ్వించే ఎలమే బలం తెలుసా ౹ప౹
చ౹౹
వలపన్నా వలచి వరించు వరద గోదారే
తలపన్నా తన్మయంతో తరలే రహదారే ౹2౹
ప్రేమంటేను అనుభవించిన అర్థమగును
ఏమంటేను చెప్పకుండిన స్వార్థమగును ౹ప౹