కోయిల కూసెనే...
కోయిల కూసెనే...
ప||
ఓ కోయిల ఆ కోనలో ఎందుకో కూసెగ
ఏమారిన ఎదలో ఏదో మెరిసెగా ఆశగ|2|
చ||
కుహు కుహు రాగాలే కోలాహలమయే
మనుసులో నిండుగ కుతూహలమయే|2|
కొత్త నాదాలే కోటిగా సాగి కోరికే కోరినే
కొంటె నినాదాలే ఒకటిగ మదినే చేరినే |ప|
చ||
రెమ్మ చాటున కొమ్మపైన నవకూజితం
కమ్మనీ గీతంలా పంచెనే రాగసంచితం |2|
తెరల పొరలు కరిగి ఆ తీపి జ్ఞాపకాలు
తెగువే తెమ్మెరై తెచ్చే కొత్త వ్యాపకాలు |ప|
చ||
ఎన్నడెరుగనీ ఆనందము ఆవహించగ
సన్నిహితమై ఆ చెలిగాలే ప్రవహించగ |2|
రాగరంజితం మధుర హృదయ నాదం
కోకిలకూజితం ప్రేమకై ఓ ప్రణయవేదం|ప|