నల్లబల్ల
నల్లబల్ల
చీకటి నిచీల్చివేసే వెలుగులా
నల్లబల్లపై సుద్దముక్కతో
ఉపాధ్యాయుడు వ్రాసే అక్షరాలు విద్యార్థుల భావిజీవితాలకు
వెలుగులు పంచుతాయి
చీకటి ఉంటేనే వెలుగుకు విలువ
ప్రతి పౌరుడు ఎప్పుడో ఒకప్పుడు నల్లబల్లను చూసిన వారే వారిబాల్యంలోదానితో విడ
దీయరాని బంధాలున్నవారే
అధ్యాపకులు కరదీపికలై పిల్లల భవిష్యత్తుదిద్దడానికి ఉపయోగించే సాధనాల్లో ప్రథమ స్థానంలో
ఉండేది నల్లబల్లే
ఈనాటి డిజిటల్ యుగంలో
కూడా నల్లబల్ల ప్రాబల్యం తగ్గలేదు
ఉపాధ్యాయులు విద్యార్థులకు
చదువు నేర్పే సాధనాల్లో ఇదీ ఒకటి.
