STORYMIRROR

ARJUNAIAH NARRA

Romance Fantasy

3  

ARJUNAIAH NARRA

Romance Fantasy

నిషి కన్యతో తొలిరేయి

నిషి కన్యతో తొలిరేయి

1 min
396

ఈ నిషాచర జీవి మూడో నిశిధిని

భారమైన రాత్రి కాలాన్ని 

ఒక్కో పెగ్గుల తాగేస్తున్నది

పఛ్చని పొలాల మధ్యలో

నులివెచ్చని ఊహల్లో

ఏకాంతంగా ఏ కాంత లేకుండా

ఒక క్వార్టర్ లో క్వరంటయిన్

ఘడియలను ఘడి వేసుకొని


చిక్ లేకున్న చికెన్ తో

ముక్కు కొరకకున్న ముక్కతో

చికెన్ తొడల సాంగత్యం లో 

ఆధరం అందకున్న

రాత్రినే వధువుగా చేసుకొని......

మధురమైన మధువును గ్రోలుతున్న......


ఎవరికి ఎరుక? 

ఈ నిశీధి రాత్రిని నలపకుంటే  

అదిమోసుకోచ్చిన రంగులెన్నో...

రాగలెన్నో....రుచులేన్నో...

పరిమళాలెన్నో....మృదువైన స్పర్శలెన్నో.....

మరువలేని మధురానుభూతులెన్నో......

రా! ఈ రసరమ్యమన రాత్రికి మోసుకొని రా!

నా దోసిట్లో సిరిమల్లె పరిమళం అవ్వు...

నా గుండే మీద గులాబీవై గుబాలించవా...

వెన్నెలవై నా ఒళ్ళంతా కాయవ....

పౌర్ణమి అలవై పాలనురగల్లే నన్ను చేరవా....


ఇక్కడ నాకిచ్చిన గెస్ట్ హౌస్లో అన్ని ఉన్నాయి.......

నీవు తప్ప..........నీవు లేక........

పొలాల పోదవిలో

వెన్నెల్లో హోయాల్లో

మంచుతుంపరలల్లో

మల్లెల మంచం.......

మత్తు పానీయం....

మధురసాలు.....

మదిలో నా యదసడిలో...

తియ్యని అలజడివయ్యావు......

వడిలోకి రా....రా .....

ప్రియా! ఈ రాత్రికి......

కాలాన్ని నలిపెద్దాం.....

కలలను పండించుకుందాం......


నైట్ నోట్:  

ఎథిక్స్ ను మధురసంలో

మిక్స్ చేసి మత్తుగా బోధించే

ఇంద్రజాల మాంత్రిక మిత్రులకు మనవి.....


నాకు ఏమి అపాదించవద్దు ,

నా విరహతాపాన్ని ఉహించవద్దు.....

ఎదో ఒక చిత్రాన్ని చూసి అలా

నాలోని శృంగార కవి కలం

కవితగా పారింది......



Rate this content
Log in

Similar telugu poem from Romance