నిర్జీవితం
నిర్జీవితం
కలవరాలన్నీ కడతేరిపోనివే అయినా చెరిపేసిన
కన్నీళ్ళన్నీ పమిట కొంగులోఇంకి పోతున్నాయి
ఆత్మీయస్పర్శలేవీ అర్ధం కాలేదు అపద్దం తొడిగిన నిజంలా
చూపుల ఆస్వాధనలో నటనలెన్ని లెక్కించలేదు
అలుసైపోయిన ఆడతనంఅనాదిగా అంతుతెలియని
వాస్తవంచెక్కుకునే నవ్వుల్లోచీకటి సంతకాలెన్నోసాక్ష్యంలేని
గాయాలకుమౌననివేదనలే సాంతంవిదిల్చిన చేతులే వెంటాడి
చేసిన గాయాలెన్నోఆత్మవిశ్వాసాన్ని తొక్కి ఓదార్పు వాకిట్లో వేలాడ
దీసిన సమర్దింపు సాహసాలెన్నొప్రాకులాడే పరువాటలో బలిపశువులై
చెమర్చే కన్నీటి చుక్కల్లో ఓడిపోతున్న వనిత తలరాతలుగాయాన్ని
గుండెలపై మోస్తూగమనానికి రంగులద్దుతుంది
అశ్రులులను అంకితమిచ్చేసినిశ్శబ్దంలో నిర్జీవితంఅతుకులు
వేసుకుంటూరేపటిపై కొత్తరాతను వెతుక్కుంటుంది
అద్దంలో కనిపించే తనేతను కాదనుకుంటూనిజం చరిత్రలో
ఇంకి పోనివ్వమంటూ..!!
