నిరీక్షణ
నిరీక్షణ


వసంతానికై కోయిల
ఎదురు చూస్తున్నట్లు..
స్వాతి చినుకుకై చకోరం వేచి చూస్తున్నట్లు..
తన మగని రాకకై
కళ్ళలో వత్తులు వేసుకుని..
కొత్తపెళ్లికూతురు ఎదురు చూపులు
వాలుకనులలో వయ్యారం ఒలకబోస్తూ..
విరహవేదన మనసు నిండా నింపుకుని..
ఊసులన్నీ ఊహలకే
పరిమితమై..
ఎదురు చూపుల జాము రాతిరి..
ఎదనిండా మధుర తలపుల వలపులతో..
తన స్వామి జాడకై వేయి కళ్లతో..
వేచి చూస్తూ గడిపెనకటా!!....