నీవు
నీవు
నా ఆశలకు ఆయువు నీవు
నా ఊహలకు ఊపిరి నీవు
నా కనులకు కలవరం నీవు
నా భావాలకు ఆదర్శం నీవు
హృదయ సంద్రాన లయ నీవు
నా ఆలోచనలకు మూలం నీవు
ఉషోదయాన సుప్రభాతం నీవు
నీలి గగనాన నెలవంక వెన్నెల నీవు
మదిలోని భావాలకు అక్షరభాష్యం నీవు
చెరగని జ్ఞాపకానికి చిరునామా నీవు
మరచిపోని పలుకే నీవు
మరచిపోని గెలుపే నీవు
నా పెదవులపై చిరునవ్వు నీవు
నా కనులలో కన్నీరు నీవు
నా మౌనంలో అలజడి నీవు
నా మాటలలో సవ్వడి నీవు
మరువలేని నా బంధం నీవు
మరపు రాని...... తనివి తీరని ఆశవు నీవు
