Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Kadambari Srinivasarao

Inspirational

4.5  

Kadambari Srinivasarao

Inspirational

నీవొక చైతన్య గీతిక

నీవొక చైతన్య గీతిక

1 min
361


సమాజంలో అవినీతిని ఎండగట్టే

అక్షర శరానివి

బడుగు వర్గాల బాధను ప్రశ్నించే

ఓదార్పు లేపన పూతవు నీవే!


పద విన్యాసపురాసులకు

ప్రాణంపోసే సంజీవినివి

అక్షరాల ఒరుపులో

ప్రాసకు పంచ ప్రాణాలు నీవే!


సాహిత్యమే ఊపిరిగా

తీరపు కెరటాల జోరులా

హోరెత్తించే శ్రావ్య గీతికవు

తెలుగు నాడికి జవసత్వాలు నీవే!


పెత్తందారుల గుండెల్లో

వాడియైన చురకత్తి రూపానివి

అల్పాక్షర సంధానంతో

అనల్పార్ధ సృష్టివి నీవే!


నిద్రాణ అవస్థలో ఉన్న జాతిని 

మేల్కొలిపే చైతన్య గీతికవు

ఘర్మ జలాన్ని చిందించి కండను కరిగించి 

శ్రామిక సేద్యం చేసే జీవుల ఆక్రన్దన పర్వంలో

తిరుగుబాటు బావుటా నీవే!



Rate this content
Log in

Similar telugu poem from Inspirational