STORYMIRROR

Midhun babu

Romance Classics Fantasy

4  

Midhun babu

Romance Classics Fantasy

నీవే

నీవే

1 min
3


పురివిప్పిన నెమలిలా

నర్తిస్తోంది మది

నీ తియ్యటి జ్ఞాపకాలతో

సీతాకోకల రంగుల కలలు

హృదిలో విహరిస్తోంది

అవిశ్రాంతంగా నీ ఆలోచన

తరంగాలు ముంచెత్తుతోంది

వెన్న దొంగల నా మదిని

చూరగొన్న చోర శిఖామణివి

నిన్ను తలపోస్తూ క్షణంలోఓ యుగంలా నిరీక్షిస్తున్నా

నీ మదిలో అణువంతైనా

అనురాగం వెల్లివిరిసినదా

నా ఎదురు తెన్నులకు

నా కలలకు అర్థం

పరమావధి నిండు

పౌర్ణమిలా నీ చూపు

తారకల నీ మందహాసం

మృదు మధురమైన నీ

మార్థవపు పలకరింపు

చల్లని చిరుగాలిలా 

నీ రాక వస్తావు కదూ !


Rate this content
Log in

Similar telugu poem from Romance