STORYMIRROR

Midhun babu

Romance Classics Fantasy

4  

Midhun babu

Romance Classics Fantasy

నీతలపుల వాకీట్గో

నీతలపుల వాకీట్గో

1 min
9



నీ తలపుల వాకిట్లో పెరిగిన
 మొండి మొక్కను నేను...!!
ఎన్నిమార్లు పెకలించినా 
మర్నాటికి చిగురిస్తాను !!
వాడిపోని వసంతమైనా 
శిశిరంలో మోడునునేనైనా
నీతలపుల్లో పెరిగిన నేను
నిలువెల్లా పులకిస్తాను !!
నీతలపులవాకిట్లోనే కనుమూసి నిదురిస్తాను !!
ఆనిద్దుర పొద్దుల్లోనే కమనీయపు కలగంటాను !!
తడియారని చెక్కిలిచెలిమై 
పొడిబారిన పెదవులకలిమై
పలుకరించి కదులుతు ఉంటా
కమనీయపు ఆశలురేపీ
మరోమారు బతికేస్తుంటా...!!నీతలపులవాకిట్లోనే ప్రతిక్షణమూ జీవిస్తుంటా 
నీమనసున మురిపెము నేనై 
అనుక్షణమూ మెలివేస్తుంటా !!
మదినిండా కాపురముంటూ 
కనురెప్పల చప్పుడు వింటా!!నీతలపులవాకిట్లోనే
రంగవల్లినై తిరుగుతుఉంటా!!
రగులుకున్న ఊపిరిలోనే నులివెచ్చని శ్వాసనునేనై 
నాగురుతుగ నిన్నుగమనిస్తుంటా !!
నీతలపులవాకిట్లోనే
కనురెప్పై కదులుతు ఉంటా
కమనీయపు కనుపాపను నేనై నిత్యం నేమెదులుతు ఉంటా !!
తమకంగా పులకించేలా చిరుగాలి
సవ్వడినేనై తనువెల్లా తాకుతు ఉంటా ...!


Rate this content
Log in

Similar telugu poem from Romance