నీరు
నీరు


నీరు గూర్చి నిజము నేరుగా చెబుతాను
ఓర్పుతోడి వినర ఓ ఆంధ్ర పౌరుడా !!
నీరులేని పైరునూహించగలవా
జలాలు లేక పొలాలు పండిచెరువులంతరించి చగలవా
నీరు లేని ఊరునూరడించగలవా
నీటికోసం పడే కష్టాలను కనవా !!
చెరువులంతరించి కరువుకాటకాలిస్తె
మారిన వాతావరణం మరణమే తెస్తే
యోగ క్షేమాలు పోయి రోగ క్షామాలు వస్తే
ఎవరు బాధ్యులు దీనికి ఆలోచన చేస్తే !!
ఊరు ఊరునా ఇదే తీరు
ఎంత తవ్వినా ఏది నీరు
కడివెడు నీళ్లకై కన్నీరు మున్నీరు
బోర్లు వేసిన వారు బోరుమంటున్నారు
బావులు తవ్వినవారు బావురుమంటున్నారు !!
నాయకులు కార్చేవి మొసలి కన్నీరు
నీళ్లిమ్మున్నామంటే నీళ్లు నములుతారు
నీటి బుడగలాటి నోటి మాటలు చెబుతారు
గుక్కెడు నీళ్లిమ్మంటే దిక్కులు చూస్తుంటారు !!
గొంతెమ్మ కోరికకాదిది గొంతెండిపోతోంది
నారు పోసిన వాడు నీరు పోయడండి
నీళ్ళనెపుడు మీరు నీటిపాలు చేయకండి
కనండి సమస్య పరిష్కారము వెదకండి !!