నీలోనే
నీలోనే
కోపానికి ధూపమేయు..శక్తి ఉంది నీలోనే..!
సహనానికి బలమిచ్చే..తెలివి ఉంది నీలోనే..!
నిజం ఎక్కడుందంటే..కలలు నవ్వుతాయి కదా..!
జగడాలకు సెలవిచ్చే..చెలిమి ఉంది నీలోనే..!
నీకోసం పనిచేసే..వారెవ్వరు ఉండరులే..
బద్ధకాన్ని లాలించే..భక్తి ఉంది నీలోనే..!
ప్రేమకన్న మత్తుమందు..లేదన్నది చెప్పలేను..
మోహానికి విడిది చూపు..యుక్తి ఉంది నీలోనే..!
మనసుపడే పనేలేని..మనసన్నది నీదే కద..
అంతులేని చిరునవ్వుల..రాశి ఉంది నీలోనే..!

