STORYMIRROR

శ్రీలత.కొట్టె "హృదయ స్పందన "

Abstract Romance Classics

4  

శ్రీలత.కొట్టె "హృదయ స్పందన "

Abstract Romance Classics

నీకే నే అంకితం...

నీకే నే అంకితం...

1 min
250


ప్రియా,



నిన్ను ప్రేమించిన రోజు నుంచి నేను నీ ధ్యానంలో పడి అన్నిటికి దూరం అయ్యాను. అయినా నీకు అంకితం అవుతున్నాననే ఆనందం.


మండుటెండలో.. చలి మంచుల్లో...

నిశీధిలో.. పండు వెన్నెల్లో...

నీకోసం ఎదురుచూస్తూ ఉంటాను..

నువ్వు కనిపిస్తే సాగర సమీరాన్నయి నిన్ను అల్లుకుపోతాను....

నీ బాహువుల్లో బందీని అవుతాను..

ఆ క్షణం ఒక తీయని అనుభూతి

మనసుని తాకుతుంది.

నులివెచ్చని నీ స్పర్శకి తనువు పులకించిపోతుంది.


  ప్రతీ రేయి నువు నా పక్కనే ఉన్న అనుభూతి, నువ్విచ్చే తీయని ముద్దుల వర్షం తో తడుస్తూ..

నీ కౌగిలిలో వేడి నిట్టూర్పుల సెగలో కొత్త లోకంలో విహరిస్తూ..నా సర్వస్వము నీకు అర్పిస్తాను..


 నీతో గడిపే క్షణాలు ఊహలు, కలలు అయినా అవి నాకు వాస్తవాలె. వాటిని నేను సజీవంగా అనుభూతి చెందుతాను. ఆనందం పొందుతాను. నన్ను నేను మైమరచిపోతాను..


శ్రీ...

హృదయ స్పందన 


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Abstract