నీ వేను
నీ వేను
అభేరీ అభోగీ..భోగాలు నీవేను..!
వైభోగ దీపాల..గీతాలు నీవేను..!
మాటాడ వలెనేమి..ఎవరితో ఈపైన..
వినుమోయి మౌనంపు..రాగాలు నీవేను..!
నీ చుట్టు ఉన్నదే..నీలోక మనుకోకు..
కనుమోయి నీలోని..విశ్వాలు నీవేను..!
పుణ్యాలొ పాపాలొ..నరకాలొ స్వర్గాలొ..
కర్తవ్య పాలనా..ధర్మాలు నీవేను..!
నీదైన 'నేను'తో..కలిసేది ఎన్నటికి..
కణకణములో జరుగు..నాట్యాలు నీవేను..!
ఈ చిత్రసీమనే..నడిపేది నీ శ్వాస..
బంధాల గంధాల..దారాలు నీవేను..!
