నీ ప్రేమను
నీ ప్రేమను
నీకుగాక మరి ఎవరికి..చెప్పుకొందు నా బాధను..!
ఎంతగొడవ పడతానో..తెలుసుకొందు నీ ప్రేమను..!
పాత్రలోన ఇమడలేని..బలహీనత తొలగునెలా..
మౌనపు శృతిలో చక్కగ..అల్లుకొందు నీ పాటను..!
ముసుగులేవొ వేసుకునే..బ్రతుకీడ్చుట దుర్భరమే..
తేనెతోటి తెగతెంపులు..చేసుకొందు నా ఆశను..!
మరుగుతున్న విరహమనే..కడలితోటి పనేంలేదు..
నీ చెలిమికి అద్దంలా..నిలుపుకొందు నా నీడను..!
నన్ను నేను చంపుకునే..ఆటలోనె మునిగితినే..
వింతమోహ మెంతైనా..మార్చుకొందు నా బాటను..!
నా హృదినే కోవెలగా..ఉన్నదెవరు నీవుగాక..
తెలివిలేని తనంవీడి..తెచ్చుకొందు నా ఎఱుకను..!

