నీ పాటను
నీ పాటను
గుండెగువ్వ కువకువలో..వింటున్నా నీ పాటను..!
చెలిమిపూల పల్లకిలో..మోస్తున్నా నీ పాటను..!
కోటికోట్ల కిరణాలకు..ప్రాణమెలా పోసేవో..
ప్రతివేకువ ముగ్గులలో..చూస్తున్నా నీ పాటను..!
చీకటికే ముద్దొచ్చే..వయ్యారం కురిసేవా..
గగనాలకు సింధూరం..చేస్తున్నా నీ పాటను..!
నిదురపూల కర్పూరం..గుప్పుమనగ సంబరమే..
కనురెప్పల ఊయలలో..దాస్తున్నా నీ పాటను..!
అల్లుకున్న వేదనలను..రూపుమాపు'తావు కదా..
నిద్దురలో మెలకువలో..అవుతున్నా నీ పాటను..!

