నీ నాట్యం
నీ నాట్యం
కణకణమున కంటున్నా..అక్షరాల నీ నాట్యం..!
నా లోలో వింటున్నా..ప్రవహించే నీ గానం..!
ఎన్నిభావ చిత్రాలో..అన్నీ నీ బహుమతులే..
గీయకనే గీస్తున్నా..గీయలేని నీ రూపం..!
నా ఊహల తంత్రులనే..మీటుతున్న నీవెవరో..
ఓ పాటగ వ్రాస్తున్నా..అంతులేని నీ మౌనం..!
పెట్టలేను మాటలలో..పరవశాగ్ని వర్షమేదొ..
హృదయగగన మేఘాలను..ఏలుతోంది నీ రాగం..!
విషయమేమి ఉండేనట..విషమయమే గుణసర్వం..
అశేషమది విశేషమే..ఈ కాలం నీ కావ్యం..!
నిన్నుగూర్చి పాడుకునే..ముచ్చటయే అపురూపం..
వెన్నుతట్టి నడుపుతూనె..ఏలుతోంది నీ తత్వం..!

