STORYMIRROR

Midhun babu

Romance Classics Fantasy

3  

Midhun babu

Romance Classics Fantasy

నీ మాటలే ముచ్చట్లు గా

నీ మాటలే ముచ్చట్లు గా

1 min
186


నీ రెప్పల సవ్వడులు ఎందుకో 

నాకు మంత్రాలుగా తోచాయి

నీ చూపులే చురకత్తులుగా

నా కళ్ళముందు కదలాయి..


నీ మాటలే ధ్వనుల్లాగా

నా మనసు వీణ పలుకుతుంది

నీ మోహమంతా చూస్తుంటే

నా కవితకు అమృతం అంటింది..


నీ నడకల్లో నాట్యముందో

అవి వేడుకలై నన్ను కదిలించే

నీ అందెల సవ్వడి వింటే 

నాట్య శాస్త్రమే నా ముందు కదిలే..


రుచులన్నీ కలిపి తింటున్నట్లు

నా జివ్వా చాపల్యం తీరుతుంది

నీ పదముల మాధుర్యం స్వీకరిస్తూ 

పరమాన్న రుచులను ఆరగించాను..


తొలకరి చినుకుల్లో నిన్ను చూసి

హృదయమంతా తడిసి ముద్దైను

నీ తలపుల రెప్పల్లో వికసించి

కనుగుడ్డు పాపపై నిలబడ్డాను...


చెప్పలేను నీ అందపు రహస్యం 

విప్పి వినిపించలేని భావ సౌందర్యం 

నీ వెలుగులో సరిగమలు వింటూ

ఈ రేయంతా సుఖ నిద్రలో తూగు తాను..



Rate this content
Log in

Similar telugu poem from Romance