STORYMIRROR

Radha Krishna

Action Inspirational Others

4  

Radha Krishna

Action Inspirational Others

నీ మార్గం

నీ మార్గం

1 min
205

ఎవరో వస్తారని.. ఏదో చేస్తారని

ఎదురుచూసి మోసపోకుమా

నిజం మరచి నిదుర పోకుమా!!

లే..నిదుర లే..నిన్ను ఎవరు చేయి పట్టుకు నడిపించరు.

నీ మార్గాన్ని నువ్వే ఏర్పాటు చేసుకో

అందులో పూలు పరచుకుంటావో

ముళ్ల కంచెలు వేసుకుంటావో నీ ఇష్టం.

మంచి చెప్పేవారి మాటలు కటువుగా ఉన్నాయని

వారి మాటలు పెడచెవిన పెడతావో...

లేక

నువ్వు పచ్చగా ఉంటే నీ చుట్టూ భజన చేసేవాళ్ళు

నువ్వు మోడు బరితే నీ మొహం కూడా చూడనివాళ్ళు

నీకు వెనుకనుండి గోతులు తీసేవాళ్ళు

నీ ఆత్మ విశ్వాసాన్ని దెబ్బ తీసే వాళ్ళు

అదును చూసి దెబ్బకొట్టేవాళ్ల తీపి మాటలు

వింటావో నీ ఇష్టం.

తెలుసుకో...ఎవరు ఎలాంటివారో తెలుసుకో.

ఒక అబ్రహం లింకన్..

ఒక అబ్దుల్ కలామ్..

ఒక నెల్సన్ మండేలా..

ఎవరో కాదు...నీకు ప్రత్యక్ష స్ఫూర్తిదాయకమైన

నిన్ను కన్న తల్లిదండ్రులను ఆదర్శంగా తీసుకో.

వాళ్ళు పడ్డ కష్టాలముందు..వాళ్ళు చూసిన జీవితం ముందు నీ కష్టాలు ఏపాటివో తెలుసుకో.

జీవితం అంటే వడ్డించిన విస్తరి కాదు అని తెలుసుకో.

లే..

నీలో నిద్రాణమై ఉన్న శక్తులను మేల్కొలుపు.

నీ మార్గాన్ని మంచి లక్ష్య సాధనవైపు మళ్ళించు

నీ జీవితాన్ని నువ్వే అద్భుతంగా మలుచుకో.


Rate this content
Log in

Similar telugu poem from Action