నీ జన్మ విలువ తెలుసుకో
నీ జన్మ విలువ తెలుసుకో
జీవులన్నింటిలో బుద్దీజీవి నీవు
నాగరికతను సృష్టించినావు
విత్తులే నాటావు, పంటపండిoచి
నిప్పునే కనుగొని వండుటనేర్చావు
ఇంటి నే నిర్మించి రక్షణ నేర్చావు
భాషనే ర్చి,లిపి కనుగొన్నావు
విద్యలేనేర్చావు,విశ్వరహస్యము
చేధించ పరిశోధనలు చేసావు.
కనుగొన్న విషయాన్ని వారసులకు
తరతరాలుగా ప్రసాదంగా అందించావు.
నాగరికత పేరుతో సాంకేతిక విద్య
లోఅభివృద్ధి సాధించావు.
తెలివయిన వాడిగా జ్ఞానదార పొందిన నీవు
కనుగొన్న విషయాల్ని పతనానికి
వాడుకుంటున్నావు.
కత్తి కనుగొని ఇచ్చిన స్ఫూర్తి
నేరాలు ఘోరాలకు ఉపయోగప డే
విజ్ఞానము అజ్ఞానంగా మారి
స్వయంకృతం గా మద్యపానము,గంజాయి
వంటి చెడు వైపు పయనించే వు.
కట్టుబాట్లు తో ఏర్పరచిన నాగరికతను,సంప్రదాయాలను
కూకటివేళ్లతో పీకిపతనమునకు
నువ్వే పునాదులు వేసుకునే
ఆలోచనలు మానుకో యువతా!
