నీ చెలిమి తీర్థమే
నీ చెలిమి తీర్థమే
నీ చెలిమి తీర్థమే..సేవిస్తు ఉంటాను..!
నీ ప్రేమ గగనాన..శ్వాసిస్తు ఉంటాను..!
ఏ క్షణము కా క్షణము..కొంగ్రత్త మొలకనే..
నీ చూపు వర్షాన..చిగురిస్తు ఉంటాను..!
ఏ తీగ కా తీగ..కోరేను నీ మెఱుపు..
నీవు ఎద మీటగా..పుష్పిస్తు ఉంటాను..!
సరసాల వీణియగ..మలచేవు ఈ నన్ను..
మిన్నంటు మౌనమై..పులకిస్తు ఉంటాను..!
శతకోటి రాగాల..హరివిల్లు చెలి నీవు..
నీ ముచ్చటలు తీర్చ..స్పందిస్తు ఉంటాను..!

