నీ చెలిమి లో
నీ చెలిమి లో
ఏ జన్మలోనో బంగారు పూలతో పూజలు చేసి వుంటా ఈ జన్మలో నీ స్నేహం దొరికింది అనను
ఏ జన్మలోనో ఎందరికో స్నేహాన్ని పంచి వుంటా అందుకే నీ స్నేహం లతలా నన్ను అల్లుకుంది...
ఏ జన్మలోనో
ఎన్నో ప్రేమ జంటలను కలిపి వుంటా అందుకే నీ ప్రేమ నన్ను నిలువెల్లా తడిపేస్తుంది...
ఏ జన్మలోనో
ఎందరికో అనురాగాన్ని, ఆప్యాయతనూ పంచి వుంటా అందుకే నీ అభిమానంతో నన్ను అందలం ఎక్కించావు...
ఏ జన్మలోనో అన్ని బంధాలకూ, బాంధవ్యాలకూ ఎంతో విలువ ఇచ్చి వుంటా 。 ఆ పుణ్యమంతా ఈ జన్మలో నీ రూపంలో నాకు లభించింది...
నీ ప్రేమనంతా ఈ జన్మలోనే చూపించేయకు నా చిన్ని హృదయం తట్టుకోలేదు మరుజన్మకు కూడా దాచివుంచు నీ ప్రేమ, స్నేహం నాకు జన్మ జన్మలకూ కావాలి ఇస్తావు కదా ప్రియతమా...

