STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

నేస్తం

నేస్తం

1 min
334

జన్మల చిరుగుల దుప్పటి కాల్చేదెప్పుడు నేస్తం..!?

కర్మల మరిగే బాణలి వదిలేదెప్పుడు నేస్తం..!?


తియ్యని కలలకు ద్రోహం ఎన్నడు జరుగదు చూడూ..!

కోర్కెల మబ్బుల కౌగిలి వీడేదెప్పుడు నేస్తం..?!


ఆశల రెక్కల బలమది ఎంతోతెలియుట ముఖ్యం..!

కులాలు మతాల గొంగళి విసిరేదెప్పుడు నేస్తం..!?


అసలగు మైత్రికి తలుపులు తీసే మనసే నీదోయ్..!

కలతల పొగిలే జావళి నిలిపేదెప్పుడు నేస్తం..!?


శ్వాసల కొలువగు మౌనపు తోటన చేరగ తలచుము..!

మారణ కాండల వారధి కూల్చేదెప్పుడు నేస్తం..?!


Rate this content
Log in

Similar telugu poem from Romance